క్రమబద్ధీకరణకై యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమ్మె నోటీస్

హనుమకొండ (జూన్ – 12) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈరోజు కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ అయినా ప్రొఫెసర్. టి. శ్రీనివాసరావు గారికి తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ నుంచి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందని డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్ జెఎసి కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్, జెఎసి నాయకులు జరుపుల చందులాల్, డాక్టర్ మధుకర్ రావు, డాక్టర్ చీకటి శ్రీనివాస్, డాక్టర్ బ్లెస్సీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.