వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలను పెంచాలి – డా. శ్రీధర్ కుమార్ లోధ్

కేయూ క్యాంపస్ (అక్టోబర్ – 12) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు పెంచాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ డిమాండ్ చేశారు.

బుధవారం నాడు కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ డిపార్ట్మెంట్ లో కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం సమావేశంలో డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ముప్పై శాతం వేతనాలు పెంచారు, కానీ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సాగదీస్తూ నేటి వరకు పెంచలేదు కాబట్టి తక్షణమే నలభై ఆరు శాతం వేతనాలు పెంచి ప్రతి సంవత్సరం అయిదు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, నెట్ / సెట్ + పీహెచ్డీ అదనపు క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. త్వరగా పెంచకపోతే యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల అందరూ ఆందోళన, పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం సలహాదారులు డాక్టర్ గడ్డం కృష్ణ, డాక్టర్ సంగీత్ కుమార్, డాక్టర్ సుజాత, డాక్టర్ బ్లెస్సీ ప్రియాంక, డాక్టర్ బ్రహ్మయ్య, డాక్టర్ మధుకర్ రావు, డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, డాక్టర్ భాగ్య, డాక్టర్ సునీత, డాక్టర్ సుకన్య, శశిధర్, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us @