ఇంటర్ విద్యార్థులందరూ పాస్

తాజాగా నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలలో కేవలం 49 శాతం మంది మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హజరైన విద్యార్థులందరిని కనీస మార్కులతో ఉత్తీర్ణులుగా పరిగణనలోకి తీసుకుంంటున్ననట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు.

కరోనా నేపథ్యంలో దాదాపు పూర్తి స్థాయిలో ఆన్లైన్ తరగతులు నిర్వహించడం, కేవలం నెల రోజులు మాత్రమే భౌతిక తరగతులు నిర్వహించడం తో విద్యార్థులు పరీక్షకు పూర్తిగా సన్నద్ధం కానీ నేపథ్యంలో విద్యార్థులను కనీస మార్కులతో ఉత్తీర్ణత చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రకటన చేశారు..

పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ కనీసం మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రకటించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us @