AISSEE RESULTS : ఆలిండియా సైనిక స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి

న్యూడిల్లీ (ఫిబ్రవరి – 25) : దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి.

ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జనవరి 8న నిర్వహించింది. ఎన్జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 కొత్త సైనిక పాఠశాలలకు సంబంధించి ఆరో తరగతి ప్రవేశాలు సైతం AISSEE-2023 ద్వారా జరుగుతాయి.

రాత పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు త్వరలో ప్రారంభం కానున్న ఇ-కౌన్సెలింగు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, శారీరక దారుడ్య, వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధిత సైనిక పాఠశాలలో ప్రవేశం కల్పిస్తారు.

CHECK AISSEE 2023 RESULTS HERE