AISSEE 2024 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్

న్యూడిల్లీ (నవంబర్ – 08) : దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక స్కూల్స్ లో 2023 – 24 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆలిండియా సైనిక్ పాఠశాలల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE – 2024 admission notification) నోటిఫికేషన్ NTA విడుదల చేసింది.

నూతనంగా 19 సైనిక్ స్కూల్స్ కు కేంద్ర ఆమోదం లభించింది. 2024 – 25 విద్య సంవత్సరంలో ఈ నూతన పాఠశాలల్లో ఆరవ తరగతి ప్రవేశాలు జరపనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరుకొండ, కలికిరి, కృష్ణపట్నం లలో సైనిక పాఠశాలలు కలవు.

అర్హతలు :

  • 6వ తరగతిలో ప్రవేశానికి 12 సం.లోపు కలిగి ఉండి 5వ తరగతి ఉత్తీర్ణత సాదించాలి.,
  • 9వ తరగతిలో ప్రవేశానికి 13-15 సం.లోపు వయస్సు ఉండాలి. 8వ తరగతి ఉత్తీర్ణత సాదించాలి.,

ఫీజు : జనరల్ అభ్యర్థులు రూ.650, SC, ST అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో

◆ చివరి తేదీ : డిసెంబర్ – 16 – 2024 సాయంత్రం 5.00 గంటల వరకు.

◆ దరఖాస్తు సవరణ : డిసెంబర్ – 18 నుండి 20వ తేదీ వరకు

◆ పరీక్ష తేదీ : జనవరి – 21 – 2024

◆ సీట్ల కేటాయింపు: ఆరో తరగతి (ప్రభుత్వ- 2970, ప్రైవేటు- 2255)కి 5225; తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు.

ఏపీలోని కోరుకొండ(విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు జిల్లా), కృష్ణపట్నం ( ఎస్పీ ఎస్సార్
నెల్లూరు) లో సైనిక పాఠశాలలు ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సబ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సబ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ద్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

◆ నోటిఫికేషన్.: Download Pdf

◆ వెబ్సైట్ : https://aissee.nta.nic.in/