AAI JOBS : ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు

న్యూఢిల్లీ (జూలై – 24) : న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 342 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ – 4వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ పోస్టుల వివరాలు : జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్), సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్), జూనియర్ ఎగ్జిక్యూటివ్

◆ మొత్తం ఖాళీలు: 342

◆ అర్హతలు : పోస్టును బట్టి డిగ్రీ, బీకాం, సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్, ఎల్ఎల్బీ ఉత్తీర్ణతతో పాటు లైట్
మోటార్ వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి.

◆ వయోపరిమితి : సీనియర్/జూనియర్ అసిస్టెంట్ కు 30, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కు 27 ఏళ్లు మించకూడదు.

◆ ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్స్, ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ద్వారా

◆ దరఖాస్తు పద్దతి : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 4 – 2023

◆ వెబ్సైట్: https://www.aai.aero/en/recruitment/release/all