కూలిన వాయుసేన హెలికాప్టర్ లో బిపిన్ రావత్

త‌మిళ‌నాడులోని కునూరులో కుప్ప‌కూలిన MI 17V5 హెలికాప్ట‌ర్‌లో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ఉన్న‌ట్లు వాయుసేన ప్ర‌క‌టించింది. రావ‌త్ కుటుంబ స‌భ్యులు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో మొత్తం 14 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది.

స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఆర్మీ, పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు. ప్ర‌మాదంపై త‌క్ష‌ణ విచార‌ణ‌కు వాయుసేన ఆదేశించింది. అయితే ప్ర‌మాద‌స్థ‌లి నుంచి రెండు మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు మృత‌దేహాలు కూడా 80 శాతం కాలిపోయాయి.