AIIMS JOBS : 3,055 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 27) : దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS JOBS) లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. NORCET 2023 లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉండనుంది. ఈ NORCET లో వచ్చిన మార్కుల ఆధారంగా తర్వాత కూడా ఉద్యోగాలు కల్పిస్తారు.

◆ అర్హతలు : డిప్లొమా (జిఎన్ఎమ్) తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బిఎస్సి నర్సింగ్, బీఎస్సీ పోస్ట్ సర్టిఫికెట్, పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సులుగా రిజిస్టర్ అయి ఉండాలి.

◆ వయోపరిమితి : 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు.

◆ వేతనం : 44,900 +డిఏ + హెచ్ఆర్ఏ

◆ ఎంపిక విధానం : నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET 2023) లో చూపిన ప్రతిభ ఆధారంగా. మొత్తం ఖాళీలలో 80 శాతం మహిళలకు, 20 శాతం పురుషులకు కేటాయించారు.

◆ పరీక్ష విధానం : NORCET ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలు ఉంటాయి. 180 సబ్జెక్టుకు సంబంధించినవి, మిగిలిన 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి వస్తాయి.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : మే 5 – 2023

◆ అడ్మిట్ కార్డుల విడుదల : మే – 25 – 2023

◆ పరీక్ష తేదీ : జూన్ 3 – 2023

◆ వెబ్సైట్ : https://norcet4.aiimsexams.ac.in