EAMCET COUNSELLING : ఆగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పుడ్ టెక్నాలజీ అడ్మిషన్లు

హైదరాబాద్ (జూన్ – 03) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU) ఎంపీసీ స్ట్రీమ్ విభాగంలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (B. Tech) ఫుడ్ టెక్నాలజీ (B.Tech) కోర్సులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ కోర్సులలో ఎంసెట్ 2023 ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు.

త్వరలో వీటికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు.

అగ్రికల్చరల్ ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ సంగారెడ్డి జిల్లా కంది వ్యవసాయ కళాశాలలో, ఫుడ్ టెక్నాలజీ కోర్స్ నిజామాబాద్ జిల్లాలోనో రుద్రూరు కాలేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ యందు కలవు.