అగ్రికల్చర్ బీటెక్, బీఎస్సీ సీట్లకు నేడు వాక్ ఇన్ కౌన్సెలింగ్

హైదరాబాద్ (ఆగస్టు – 30) : ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బీటెక్ (వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ఖాళీ సీట్లకు ఆగస్టు 30న నేరుగా (వాక్ఇన్) కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ తెలిపారు.

బీటెక్ సీట్లలో 40 శాతం సీట్లు రైతు కోటాకు, బీఎస్సీలో 40 శాతం సీట్లు గ్రామీణ కోటాకు కేటాయించామన్నారు.

ఇంటర్ ఎంపీసీ స్ట్రీంలో ఉత్తీర్ణులై ఎంసెట్-2023లో ర్యాంకులు పొందినవారు, ఇంటర్ ఎంపీసీ, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కౌన్సెలింగుకు హాజరు కావాలని కోరారు.

టీఎస్ ఎంసెట్ లో ఉత్తీర్ణులై వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకూ ప్రాధాన్యమిస్తామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలతో పాటు నిర్ణీత రుసుం రూ.45 వేలతో హాజరు కావాలని తెలిపారు.

వెబ్సైట్ : www.pjtsau.edu.in