అగ్రి డిప్లొమా మిగులు సీట్లకు 9న కౌన్సెలింగ్

హైదరాబాద్ (ఆగస్టు 08) : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ విభాగాల్లో అగ్రి డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్లకు ఆగస్టు 9న ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.

యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కౌన్సెలింగు పాలిసెట్ ర్యాంకు సాధించిన విద్యార్థులకు తొలి ప్రాధాన్యం, ఇతర విద్యార్థులకు రెండో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

ఆసక్తిగల అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు నిర్ణీత ఫీజు రూ.20 వేలతో హాజరు కావాలని పేర్కొన్నారు.

◆ వెబ్సైట్ : https://www.pjtsau.edu.in/