హైదరాబాద్ (జూలై 25) : పాలిసెట్ – 2023 ర్యాంక్ ఆధారంగా రెండేండ్ల వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా, మూడేండ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల రెండో దశ కౌన్సెలింగ్ ను జూలై 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణ తెలిపారు.
జూలై 27న పాలిసెట్ – 2023 లో 417 – 44823 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉండనుంది.
జూలై – 28న పాలిసెట్ – 2023 లో 45043 – 80565 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉండనుంది.
యూనివర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు
వెబ్సైట్ సంప్రదించాలని రిజిస్ట్రార్ సూచించారు.