AGNIVEER VAYU JOBS : వాయు సేనలో అగ్నివీర్ నియామకాలు

హైదరాబాద్ (జూలై – 18) : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత వాయుసేన.. అగ్నిపథ్ స్కీమ్ (agnipath scheme) లో భాగంగా అగ్నివీర్ వాయు (agniveer vayu recruitment p నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ఇంటర్మీడియట్ (సైన్స్ కాని ఇతర
సబ్జెక్టులు)/ఇంటర్ ఒకేషనల్ లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ /ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) /తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.

నిర్దిష్ట శారీరక దారుఢ్య/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

◆ ఎంపిక విధానం :

ఫేజ్-1(ఆన్లైన్ రాతపరీక్ష),

ఫేజ్-2(ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2),

ఫేజ్-3(మెడికల్ ఫిట్నెస్ట్ టెస్ట్),

ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : జూలై 27 నుంచి ఆగస్టు 17 వరకు

ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం : అక్టోబర్ – 13 – 2023 నుంచి

◆ వెబ్సైట్:https://agnipathvayu.cdac.in