Agniveer jobs : సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

సికింద్రాబాద్ (ఎప్రిల్‌ – 20) : కంటో న్మెంట్ ప్రాంతం బొల్లారంలోని 1EME సెంటర్ లో జూన్ 3వ తేదీ నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ (అగ్ని వీర్) నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారి కుమారులు, సైనికోద్యోగులు, మాజీ సైనికోద్యోగుల కుమారులు, మాజీ సైనికోద్యోగుల సొంత సోదరుల కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ (ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రిషియన్, మోటార్ వెహికిల్ మెకానిక్, డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనర్ మెకానిక్), అగ్నివీర్ ట్రేడ్స్మెన్, స్టీవార్డ్లతో పాటు ఈత, వాలీబాల్ రంగాలకు సంబంధించిన క్రీడా కారులకు ఓపెన్ కేటగిరీలో ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు.

అభ్యర్థులు పదిహేడున్నర నుంచి 21 ఏళ్ల వయస్కులై ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం బొల్లారం, 1ఈఎంఈ సెంటర్ హెడ్ క్వార్టర్స్ను గానీ, వెబ్సైట్, 040-27863016 నంబర్లలో గానీ సంప్రదించాలని అధికారులు సూచించారు.

వెబ్సైట్ : www.joinindianarmy.nic.in