- తెలంగాణ అన్ని జిల్లాల అభ్యర్థులు పాల్గొనవచ్చు.
- అగ్నివీర్ పథకంలో బాగంగా నియామకాలు
హైదరాబాద్ (అక్టోబర్ 11) : భారత సైన్యంలో ‘అగ్నివీర్’ నియామకాల్లో భాగంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని అక్టోబర్ 15 నుంచి 31 వరకు సూర్యాపేటలో నిర్వహించనున్నట్టు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్మీ ర్యాలీ ఉంటున్నదని పేర్కొన్నారు. దీనికి తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
అగ్నివీర్ జనరల్, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్ మాన్ వంటి క్యాటగిరీలలో నియామకాలుంటాయని వివరించారు.
దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ధ్రువీకరణ పత్రాలను రిక్రూట్మెంట్ ర్యాలీకి వచ్చేటప్పుడు విధిగా తీసుకురావాలని సూచించారు.
Follow Us @