హైదరాబాద్ (మే – 26) : అగ్నిపథ్ పథకంలో భాగంగా 1,465 అగ్నివీర్ (1,465 agniveer jobs) నియామకాలకు భారత నావికాధళం (Indian navy jobs) రెండు నోటిఫికేషన్ లు జారీచేసింది. అగ్నివీర్ (SSR) – 1,365, అగ్నివీర్ (MR) – 100 పోస్టులను ఈ నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేయనున్నారు.
◆ అర్హతలు :
అగ్నివీర్ (SSR) – 1,365 : మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులుగా గల ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన అవివాహిత పురుషులు, మహిళలు.
అగ్నివీర్ (MR) – 100 : పదో తరగతి లేదా తత్సమానమైన కోర్సు
◆ వయోపరిమితి : నవంబర్ – 01 – 2002 నుండి ఎప్రిల్ – 31-2005 మద్య జన్మించి ఉండాలి.
◆ ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా
◆ వేతనం : మొదటి సంవత్సరం 30 వెలు, రెండో సంవత్సరం 33 వేలు, మూడో సంవత్సరం 35,500, నాలుగో సంవత్సరం 40 వేలు
◆ దరఖాస్తు రుసుము : 500/-
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు: మే – 29 నుంచి జూన్ 16 వరకు
◆ శిక్షణ ప్రారంభం : నవంబర్ – 2023