ఉద్యోగ వయోపరిమితి 10 ఏళ్ళు పెంపు

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 80 వేల 39 ఉద్యోగాలకు ఈరోజు నుండి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి అని ప్రకటించి నిరుద్యోగులలో సంతోషాన్ని నింపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉద్యోగ అర్హత గా ఉండే వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవడంతో మరింత మందికి ఉద్యోగం కోసం పోటీ పడే అవకాశాన్ని కల్పించినట్లు అయింది.

తాజా నిర్ణయంతో OC – 44, BC, SC, ST – 49, PwDs – 54 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి ఉంటుంది. అయితే ఈ వయోపరిమితి పెంపు యూనిఫాం సర్వీసులు మినహా మిగతా పోస్టులకు వర్తించనుంది.

Follow Us @