హైదరాబాద్ (ఆగస్టు – 10) : భారత వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు కొరకు నిర్వహించనున్న ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (AFCAT 02/2023 ADMIT CARDS) రాత పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆగస్టు 25-27 తేదీలలో ఆన్లైన్ పరీక్ష జరుగనుంది. కోర్సు జులై 2024లో ప్రారంభం కానుంది. ఆన్ లైన్ పరీక్ష, స్టేజ్ 1, స్టేజ్ 2 పరీక్షలు,ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు.