హైదరాబాద్ (నవంబర్ – 30) : ఇండయన్ ఎయిర్ ఫోర్స్ లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 258 టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ – AF CAT 2023 నోటిఫికేషన్ విడుదల చేశారు.
- ఫ్లయింగ్ బ్రాంచి ఖాళీలు: 10 (పురుషులు- 5, మహిళలు- 5)
- గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 130 (పురుషులు- 117, మహిళలు- 13) బ్రాంచ్: ఏరోనాటికల్ ఇంజినీరింగ్
- గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 118(పురుషులు- 103, మహిళలు- 15) బ్రాంచ్: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్డీఎస్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ
◆ మొత్తం ఖాళీల సంఖ్య : 258.
◆ అర్హతలు:
- ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు ఏదైనా సాధారణ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న
విద్యార్ధులు కూడా అర్హులే. కనీస ఎత్తు 162.5 సె.మీ ఉండాలి. - గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ పోస్టులకు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/మెకానికల్) విభాగాల్లో లేదా అనుంబంధ బ్రాంచీల్లో బీటెక్/బీఈ పూర్తిచేసి ఉండాలి. ఇంటర్ ఫిజిక్స్, మ్యాథ్స్ ఉత్తీర్ణత తప్పనిసరి. పురుషులు 157.5 సెం.మీ., మహిళలు 152.5 సెం.మీ. ఎత్తు ఉండాలి.
- గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) పోస్టుల్లో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత, ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా బీకాం/ బీఎస్సీ/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎఫ్, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. పురుషులు 157.5 సెం.మీ., మహిళలు 152.5 సెం.మీ. ఎత్తు ఉండాలి.
- ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికెట్ ఉండాలి.
◆ వయోపరిమితి : ఫ్లయింగ్ బ్రాంచి పోస్టులకు జనవరి 1, 2024 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్/ నాన్ టెక్నికల్ బ్రాంచీలకు 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. అవివాహితులకే అవకాశం.
◆ జీత భత్యాలు : శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్ అందుతుంది. శిక్షణ అనంతరం ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంకుతో రూ.56,100 మూలవేతనం, డీఏ, హెచ్ఆర్ఎ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఎంఎస్పీ రూ.15,500 ఇస్తారు. ఇతర సౌకర్యాలూ ఉంటాయి.
◆ ఎంపిక విధానం : పోస్టును అనుసరించి ఆన్లైన్ పరీక్ష, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం (సీపీఎస్ఎస్) పరీక్ష, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.
◆ పరీక్ష ఫీజు : రూ.250.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు తేదీలు: 01-12-2022 నుంచి 30-12-202 వరకు.
◆ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 24, 25, 26.
◆ శిక్షణ ప్రారంభం: జనవరి 2024 నుంచి.