హైదరాబాద్ (ఆగస్టు – 07 ) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ ఇంజనీరింగ్ శాఖలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE JOBS FINAL ANSWER KEY) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫైనల్ కీ ని విడుదల చేసింది. ఫైనల్ కీ తో కూడిన రెస్పాన్స్ సీట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరు అయిన అభ్యర్థులు ఫైనల్ కీ తో కూడిన రెస్పాన్స్ సీట్లను లాగిన్ అవ్వడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వంటి విభాగాలలో ఖాళీల భర్తీ కోసం మే 8,9, 21, 22 వ తేదీలలో పరీక్షలు నిర్వహించారు.
ప్రాథమిక కీని ఇప్పటికే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలు స్వీకరించడం జరిగింది. నిపుణుల చేత తుది కీ రూపొందించి ఫైనల్ కీ ను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. త్వరలోనే తుది ఫలితాలను వెల్లడించనున్నారు.