హైదరాబాద్ (మే – 02) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ ఇంజనీరింగ్ శాఖలలో ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (అగ్రికల్చర్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టుల భర్తీకి మే 8, 9 వ తేదీలలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనుంది.
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను (TSPSC AEE EXAM HALL TICKETS) అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. కావున అభ్యర్థులు వెంటనే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా టిఎస్పిఎస్సి తన ప్రకటనలో తెలిపింది.
కింద ఇవ్వబడిన లింక్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు