ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెరిగాయి – అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి

జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను అందిస్తున్నట్లు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని 447 మండల కేంద్రాల్లో 1201 జూనియర్ కాలేజీలు ఉన్నాయని, వీటిలో ప్రభుత్వ, ఆదర్శ, కస్తుర్బా జూనియర్ కళాశాల ల విద్యార్థులకు ఉచిత స్టడీ మెటిరీయల్ ఇస్తామని ప్రకటించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక మరియు ఉచిత సౌకర్యాల వలన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Follow Us@