హైదరాబాద్ (జూన్ – 10) : తెలంగాణ రాష్ట్రంలోని 6 – ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు/ పాఠశాలల్లో వివిధ సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో శాస్త్రీయ, సంగీత, నృత్య, వాయిద్య విభాగాల్లో శిక్షణ కొరకు ప్రవేశాల (Admissions in government music and dance schools in telangana) నోటిఫికేషన్ జారీ అయింది.
కర్ణాటక గాత్రం, కర్ణాటక వయోలిష్, వీణ, మృదంగం, నాదస్వరం, డోలు, హిందూస్థాన్ గాత్రం, హిందూస్థానీ వయోలిన్, సితార్, తబలా, కూచిపూడి నృత్యం, భరత నాట్యం, పేరిణి నృత్యం, కథక్ నృత్యం, తదితర కోర్సుల పై ఆసక్తి ఉన్నవారు ప్రవేశం పొందుటకై ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళను సంప్రదించాలని సూచించారు.
ఈ కోర్సుల్లో ప్రవేశానికి కనీస వయస్సు 10 సంవత్సరాలని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్యాగరాజు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, రామ్ కోఠి, ప్రిన్సిపాల్ 9000544874, భక్తరామదాసు ప్రభుత్వ, సంగీత నృత్య కళాశాల, సికింద్రాబాద్, ప్రిన్సిపాల్ 9849166973, అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల,, గుడి మల్కాపూర్, ప్రిన్సిపాల్ 9703240329. విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, వరంగల్, ప్రిన్సిపాల్,
9849796546, జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల, నిజామాబాద్ ప్రిన్సిపాల్ 9704687023, ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల, మంథని, పెద్దపల్లి జిల్లా ప్రిన్సిపాల్ 8008006767 నంబర్లలో సంప్రదించాలని
సూచించారు.
ప్రవేశ దరఖాస్తు ఫారాలను తేది: 12-06-2023 నుండి ఆయా కళాశాల పాఠశాలల్లో పొందవచ్చును. పూర్తి చేసిన దరఖాస్తులు స్వీకరించుటకు చివరి తేది: 15-09-2023 గా నిర్ణయించారు.