ప్రభుత్వం జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పెంచడానికి ఉపన్యాసకుల విస్తృత ప్రచారం

కోరుట్ల (మే – 18) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బలోపేతం చేయడంలో భాగంగా ప్రవేశాలను పెంచడానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర కోరుట్ల అధ్యాపకులు గత వారం రోజులుగా పట్టణంలోని విద్యార్థిని విద్యార్థులను ఇళ్ల వద్ద కలుస్తూ ప్రభుత్వ కళాశాలలోని సదుపాయాలు ప్రభుత్వ అందిస్తున్న పుస్తకాలు మరియు బేసిక్ లర్నింగ్ మెటీరియల్ గురించి అవగాహన కల్పిస్తూ అడ్మిషన్లు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. ఈ చక్కటి అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఉపన్యాసకులు ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్స్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ జిందం రాజేష్, సంతోష్, శ్రీనివాస్, వంశీకృష్ణ , ప్రశాంత్, సాయి కృష్ణ, శిరీష్, సుబ్రహ్మణ్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.