ADITYA L1 : సౌరజ్వాల పోటోలు తీస్తున్న ఆదిత్య L1

హైదరాబాద్ (నవంబర్ -08) : సూర్యుని ఉపరితల చర్యలు, సూర్యుని కిరణాల స్వభావం అధ్యయనం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన ఆదిత్య L1 సూర్యుని లో ఎగిసిపడుతున్న సౌర జ్వాలల ఫోటోలు తీసినట్లు ఇస్రో (Aditya L1 taking photos of solar flares says isro) ఒక ప్రకటనలో తెలిపింది.

ఆదిత్య L1 వ్యోమనౌక లో ఉన్న ఉన్న హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్సరే స్పెక్ట్రో మీటర్ (HEL10S) ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో ప్రకటించింది. సౌర జ్వాలలు సూర్యుని ఉపరితలంలో అకస్మాత్తుగా ఎగిసి పడతాయి. వీటివల్ల సూర్యుడు మరింత కాంతివంతంగా ప్రకాశిస్తుంటాడు. ఈ సౌర జ్వాలల అధ్యయనం ద్వారా సూర్యుని కిరణ స్వభావాలు, సూర్యునిలో జరిగే చర్యల స్వభావాల గురించి అధ్యయనం చేయవచ్చని సమాచారం.

హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్సరే స్పెక్ట్రో మీటర్ (HEL10S) అక్టోబర్ 27 నుండి పనిచేయడం ప్రారంభించిందని ఇస్రో తెలిపింది.