ఆసియా పసిఫిక్ దేశాల కూటమిలోని (ఏపీఏసీ) వర్ధమాన దేశాలు కోవిడ్-19 టీకాలను కొనుగోలు, పంపిణీ చేసేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 9 బిలియన్ డాలర్లతో ఆసియా-పసిఫిక్ వ్యాక్సిన్ యాక్సెస్ ఫెసిలిటీ (ఏపీవ్యాక్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకావా తెలిపారు.