తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల ను క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రిన్సిపాల్ స్థాయి నుండి కమిషనరేట్ స్థాయికి జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల ఒరిజినల్ సర్టిఫికెట్లను కొంతమంది ప్రిన్సిపాల్స్ తమ వద్ద అట్టిపెట్టుకన్న నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్ ల ఒరిజినల్ సర్టిఫికెట్లకు సంబంధించి అకనాలెడ్జ్ మెంట్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు.
దీని పట్ల తెలంగాణ ప్రభుత్వ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర నాయకులు డా. కొప్పిశెట్టి సురేష్ హర్షం వ్యక్తం చేశారు.
Follow Us @