TSPSC : అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

హైదరాబాద్ (ఆగస్టు – 01) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖలలో భర్తీ చేయనున్న అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షలను ఆగస్టు 8వ తేదీన కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనుంది.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లను పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతారు. కావున అభ్యర్థులు చివరి వరకు చూడకుండా వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని టిఎస్పిఎస్సి సూచించింది. ఈ పరీక్షకు సంబంధించిన మాక్ టెస్ట్ ను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.

AP, JAO, SAO EXAM HALL TICKETS – TSPSC