TSPSC : ఎకౌంట్స్ ఆఫీసర్ దరఖాస్తు ఎడిట్ ఆఫ్షన్

హైదరాబాద్ (మే – 03) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పురపాలక శాఖలోభర్తీ చేయనున్న ఏవో పోస్టుల దరఖాస్తులో దొర్లిన తప్పులను ఎడిట్ చేసుకునే అవకాశం అభ్యర్థులకు ఇచ్చింది.

అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తప్పులను సవరించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్ఎస్సీ వెల్లడించింది. దీనికోసం వెబ్సైట్ లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని, మే 5వతేదీ నుంచి అభ్యర్ధులు దరఖాస్తును సవరించుకోవచ్చని తెలిపింది.

◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/