IND A vs PAK A FINAL : భారీ స్కోరు చేసిన పాకిస్థాన్

కొలంబో (జూలై – 23) : ACC ASIA EMERGING CUP 2023 FINAL మ్యాచ్ లో పాకిస్థాన్ A జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. పాకిస్థాన్ A జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన ఇండియా A జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ ఓపెనర్లు ఆయూబ్ (59), పర్హన్ (65) అర్ద సెంచరీలతో రాణించడంతో గట్టి పునాది పడింది. అనంతరం తయ్యబ్ తాహీర్ 71 బంతుల్లోనే 108 పరుగులు చేసి భారీ స్కోరు కు బాటలు వేశాడు. పాకిస్థాన్ A జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో పరాగ్ – 2, హంగ్రేఖర్ – 2, రాణా, సుతార్, సింధు తలో వికెట్ తీసుకున్నారు.