SCHOOL BANDH : నేడు పాఠశాలల బంద్ కి పిలుపునిచ్చిన ABVP

హైదరాబాద్ (జూన్ – 26) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లోని పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు పాఠశాలల బంద్ కు ABVP పిలుపునిచ్చింది.

స్కూళ్లలో ఖాళీగా ఉన్న 15వేల టీచర్ ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ బంద్ పాటించాలని ABVP
పిలుపునిచ్చింది..

రాష్ట్రంలో మూసేసిన ప్రభుత్వ స్కూళ్లను పున:ప్రారంభించాలని.. ప్రభుత్వ స్కూళ్లలో బుక్స్, యూనిఫాం వెంటనే అందించాలని ABVP డిమాండ్ చేస్తోంది.