AADHAR UPDATE : పదేళ్లు దాటినా ఆధార్ అప్డేట్ గడువు పెంపు

న్యూఢిల్లీ (జూన్ – 18) : పదేళ్లు దాటిన ఆధార్‌ కార్డులు అప్డేట్‌ (AADHAR UPDATE) చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సెప్టెంబర్‌ 14 వరకు గడువు పొడిగించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి చేసిన విషయం సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది మార్చి 15 నుంచి మొదటిసారిగా అవకాశం కల్పించింది. నాలుగు నెలల పాటు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

యూఐడీఏఐ నిబంధనల మేరకు ‘మై ఆధార్‌ ’ (Aadhar Update in My aadhar portal) పోర్టల్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లలో కూడా నవీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. పేరు, పుట్టిన తేదీ, చిరునామాతో పాటు తాజాగా దిగిన ఫొటోను కూడా అప్‌లోడ్‌ చేసుకునే వీలు కల్పించింది.

◆ వెబ్సైట్‌ : https://myaadhaar.uidai.gov.in