OSCAR 2023 : విజేతలు – విశేషాలు

లాస్‌ఎంజెల్స్ (మార్చి -13) : 95వ ఆస్కార్ అవార్డుల (95th Oscar) ప్రదానోత్సవం డాల్పీ దియోటర్ లో ఘనంగా జరిగింది. 23 విభాగాలలో ఈ అకాడమీ అవార్డులను అందజేస్తారు. “ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్” 7 విభాగాలలో, ” ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” చిత్రానికి 4 విభాగాలలో అవార్డులు గెలుచుకున్నాయి.

◆ భారత్ కు రెండు ఆస్కార్ లు :

భారత్ కు రెండు అస్కార్ అవార్డులు దక్కించుకుంది. “ది ఎలిఫెంట్ విస్పరర్స్” ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో, RRR సినిమాలోని “నాటు నాటు” పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డులు దక్కించుకున్నాయి.

  • ఉత్తమ చిత్రంగా “ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్” చిత్రం నిలిచింది.
  • ఉత్తమ నటుడుగా బ్రెండన్ ఫ్రెజర్,
  • ఉత్తమ నటి గా మిచిల్లే యోవ్,
  • ఉత్తమ దర్శకుడు గా డేనియల్ క్వాన్, డేనియల్ చెనెర్ట్ నిలిచారు.

◆ 7 అస్కార్ లు కైవసం :

“ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్” 7 విభాగాలలో అవార్డులు సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.

◆ 4 ఆస్కార్ లు :

” ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” చిత్రానికి నాలుగు విభాగాలలో అస్కార్ అవార్డులు గెలుచుకుంది.