- పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ సంచలన నిర్ణయం
పంజాబ్ (సెప్టెంబర్ – 05) : పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 9,000 మందికి పైగా కాంట్రాక్ట్ మరియు తాత్కాలిక టీచర్ల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో అధికారంలోకి రావడానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలలో ఇది ఒక ముఖ్య హామీ. ఈ నిర్ణయంతో వేలాది మంది కాంట్రాక్ట్, తాత్కాలిక టీచర్ల జీవితాలు మెరుగుపడతాయని.. తమది ఉద్యోగ ప్రెండ్లీ ప్రభుత్వమని ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ తెలిపారు.