ARMED FORCES JOBS : సాయుధ బలగాలలో 83 వేల ఉద్యోగ ఖాళీలు

న్యూడిల్లీ (ఫిబ్రవరి – 07) : కేంద్ర సాయుధ బలగాల్లో జనవరి 1 నాటికి 83వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.

కేంద్ర సాయుధ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB), అస్సాం రైఫిల్స్ విభాగాలు ఉన్నాయి. మొత్తం మంజూరైన ఉద్యోగాల్లో ప్రస్తుతం 83,127 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.

ఈ ఖాళీలను 2023లోనే నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. సాయుధ బలగాల్లోని ఆయా విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ.. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, సంబంధిత బలగాల ద్వారా ఖాళీల్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.