యాపిల్ పై జరిమానా విధించిన దేశం.?

ప్రపంచ ప్రఖ్యాత యాపిల్‌ కంపెనీపై ఇటలీకి చెందిన యాంటీ ట్రస్ట్‌ అథారిటీ ‘AGCM‌’ దాదాపు రూ.88 కోట్లు జరిమానాను విధించింది.

యాపిల్ ఐఫోన్లు నీటిలో పడ్డా ఏమీ కాదని (వాటర్‌ రిసిస్టెంట్‌) ‘తప్పుదారి’ పట్టించే విధంగా కంపెనీ ప్రచారం చేసిందని.. అసలు ఏ పరిస్థితుల్లో నీటి నుంచి రక్షణ ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది. కేవలం కొన్ని సందర్భాల్లోనే ఐఫోన్లు వాటర్‌ రిసిస్టెంట్‌గా ఉన్నాయని తెలిపింది.

Follow Us @