హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన మహబూబ్ నగర్ 711 సంఘం

మహబూబ్ నగర్ :: 21 సంవత్సరాల శ్రమదోపిడి నుంచి రక్షించి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన జీవో నెంబర్16 కు వ్యతిరేకంగా కొందరు నిరుద్యోగులు హైకోర్టులో వేసిన ఫిల్ తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించటం శుభపరిణామం అని తెలంగాణ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ 711 సంఘం మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరు తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు తెలంగాణ హైకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించి నందున తెలంగాణ ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ గౌరవ అధ్యక్షులు ,రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు, ఐటీ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్, విద్యా శాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డికి ,పర్యాటక శాఖ మాత్యులు వి శ్రీనివాస్ గౌడ్ కి మరియు తెలంగాణ ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జే.ఏ.సి చైర్మన్ శ్రీ కనక చంద్రంకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Follow Us @