సురభి వాణీ దేవి కి 711 సంఘం మద్దతు – కడారి శ్రీనివాస్.

ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఇంటర్విద్యా జేఏసీ చైర్మన్ పి మధుసూదన్ రెడ్డి, 711 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం, ప్రధాన కార్యదర్శి శేఖర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలతి ల నేతృత్వంలో ఉపాధ్యక్షుడు కడారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు కొరకు జీవో నెంబర్ 16 ఇవ్వడం, 12 నెలల బేసిక్ పే ఇవ్వడం, తెలంగాణ తొలి పీఆర్పీ అమలు కాంట్రాక్టు ఉద్యోగుల కు కూడా అని కేసీఆర్ ప్రకటించడం, కరోనా కష్టకాలంలో కూడా మంత్రి తన్నీరు హరీష్ రావు చొరవతో రెన్యువల్ చేసి కాంట్రాక్ట్ లెక్చరర్స్ పట్ల ప్రభుత్వం తమ పక్షపాతాన్ని చాటుకున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవి కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కడారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us@