పల్లాకే సంపూర్ణ మద్దతు – 711 సంఘం

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు అతి కీలకమైన ఇంటర్ విద్యలో ఉద్యోగుల పాత్ర మీద ఈ రోజు ఖమ్మంలో “ఇంటర్ విద్య – ఉద్యోగుల దిశా నిర్దేశం సమ్మేళనము” ఇంటర్ విద్య జేఏసీ నేత మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.

ఇంటర్ విద్య లోని వివిధ సంఘాల నేతలు ఈ సమ్మేళనంతో హజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరవడం జరిగింది.

ఈ సమావేశంలో వివిధ సంఘాల నేతలు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ విద్య ఎంతో కీలకమైనదని కావున విద్యార్థులను సరైన మార్గం చూపించడానికి ఇంటర్ విద్య లో పనిచేస్తున్న ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల సంఘం నేత కనకచంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కావాలంటే మన సమస్యలను ప్రశ్నించే, పరిష్కరించే గొంతుక అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి చట్టసభల్లో ఉండాలని ఈ సందర్భంగా కనకచంద్రం నొక్కి వక్కాణించారు.

అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటర్ విద్య అబివృద్దికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత విద్య అందిస్తుందని తెలుపుతూ… ఉద్యోగులకు కూడా సంపూర్ణ న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. పిఆర్సీని అతి త్వరలోనే అమలు చేస్తామని, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పిఆర్సీ అమలు అవుతుందని తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు క్రమబద్ధీకరణ కొరకు జారీ చేసిన జీవో 16 కోర్ట్ కేసులో ఉండటం వలన దాని పరిష్కారానికి కృషి చేస్తామని, క్రమబద్ధీకరణ చేసేంతవరకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన పిమ్మట బదిలీలను జరిపించి తీరుతానని, నెల నెల వేతనం ఇప్పించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథి ఇంటర్ విద్యార్థి జేఏసీ నేత మధుసూదన్ రెడ్డి, కనక చంద్రం, జిల్లా నరసింహ, బండి వెంకటేశ్వర్లు, అల్లు విజయ్, హేమచంద్ర, వనపర్తి శ్రీనివాస్, నవీన్ మరియు వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు

Follow Us@