ఈ ఏడాది ఇంటర్ 70% సిలబస్ తోనే…!

2021-22 విద్యాసంవత్సరానికి కూడా ఇంటర్మీడియట్‌లో 70 శాతం సిలబస్‌ను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) ఖరారుచేసింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల ఇంటర్‌బోర్డులకు లేఖలను పంపించింది. 70 శాతం సిలబస్‌ అమలుకు అనుమతినివ్వాలని కోరుతూ ఇంటర్‌బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.

గతేడాది 30 శాతం తగ్గించి, 70 శాతం సిలబస్‌ను ఖరారుచేశారు. ఈ విద్యాసంవత్సరం కూడా అదే అమలుచేయనున్నారు. గతేడాది సిలబస్‌ను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరచగా.. ఆ సిలబస్‌కే 2022 మార్చి/ ఏప్రిల్‌ నెలల్లో ఫస్టియర్‌, సెంకడియర్‌ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.

SUBJECT WISE 70% SYLLABUS

MODEL Q.P. WITH 70% SYLLABUS ALL SUBJECTS