ఇంటర్ సిలబస్ 70 శాతమే

  • నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం

హైదరాబాద్: ఇంటర్మీడియట్ లో ఈ ఏడాది 70 శాతం సిలబస్ మాత్రమే అమలు చేయబోతు న్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈరోజు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశ ముంది. రెండు సంవత్సరాలకూ ఇది వర్తిస్తుందని అధికారవర్గాలు తెలిపాయి.

30 శాతం సిలబస్ ను ఎలా కుదించాలనే దానిపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఇప్పటికి సిలబస్ పై స్పష్టత రాకపోవడంతో విద్యార్థుల ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఫస్టియర్ 30 శాతం సిలబస్ కుదించారు. కుదించిన చాప్టర్ల కొనసాగింపు సెకండియర్‌లో ఉన్నాయి. సదర చాప్టర్లను ఫస్టియర్ లో చదవకుండా సెకండియ లో చదవడంతో అర్ధం కాక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొనసాగింపు చాప్టర్లను తీసిస్తారా లేదా వేరే నిర్ణయం తీసుకుంటారా అనే బోర్డు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.

జాతీయ స్థాయిలో సిలబస్ కుదింపుపై సీబీఎస్ఈ రాష్ట్రాలకు సూచనలు చేసింది. 70 శాతం సిలబస్ అమలు మాత్రమే సరైనదని ఇంటర్ బోర్డ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు తాజాగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సిలబస్ కుదింపు ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us @