BIKKI NEWS (JAN. 07) : మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బిసి బాల, బాలికల పాఠశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను 6వ, 7వ, 8వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో ఖాళీ సీట్లలో ప్రవేశాల (6th 7th 8th backlog seats admissions in telangana bc gurukulas ) కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కొరకు బిసి, ఎన్సీ, ఎస్టి మరియు ఇబిసి లకు చెందిన తెలంగాణకు చెందిన విద్యార్థినీ విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల అయింది.
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా 08-01-2024 నుండి 15-02-2024 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు :
a) 6వ తరగతిలో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సం॥లో 5వ తరగతి చదివి ఉండాలి.
b) 7వ తరగతిలో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సం॥లో 6వ తరగతి చదివి ఉండాలి
C) 8వ తరగతిలో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సం॥లో 7వ తరగతి చదివి ఉండాలి.
d) విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 మరియు 2023 -24 విద్యా సంవత్సరములలో నిరవధికంగా విద్యను అభ్యసించి ఉండవలెను.
విద్యార్థుల తల్లిదండ్రుల/సంరక్షకుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/-, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/-కు మించరాదు.
ఎంపిక విధానం : మార్చి – 03 – 2024, ఆదివారము నాడు జరిగే ప్రవేశ పరీక్షలో కనబరచిన ప్రతిభ మరియు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులు ఎంపిక చేయబడతారు.
పాత జిల్లాల ప్రాతిపదికన ఏ కేటగిరీలో ఖాళీలు ఉన్నాయో, ఆ కేటగిరీకి సంబంధించినవారే దరఖాస్తు చేసుకోగలరు.
వయోపరిమితి : 6వ తరగతికి: 31-08-2024 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలడు.
7వ తరగతికి : 31-08-2024 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
8వ తరగతికి: 31-08-2024 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
దరఖాస్తు ఫీజు : రూ.100/- చెల్లించి,
హాల్టికెట్లు డౌన్లోడ్ తేది:23-02-2024.
పరీక్ష తేదీ :మార్చి – 03 – 2024
ఫోన్ నంబర్ : 040-23328266