67వ జాతీయ చలనచిత్ర అవార్డులను 2019 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించింది. తెలుగు నుంచి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ గెలుచుకుంది. ఇదే చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన నవీన్ నూలికి ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో అవార్డు దక్కింది.
‘ఉత్తమ ప్రజాదరణ, వినోదాత్మక చిత్రం’గా మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమాకు అవార్డు వచ్చింది. అదే సినిమాకు ఉత్తమ నృత్య దర్శకత్వం కేటగిరీలో రాజు సుందరానికి అవార్డు దక్కింది.
◆ ఉత్తమ నటులు ::
జాతీయ ఉత్తమ నటులుగా ధనుష్(అసురన్), మనోజ్ వాజపేయీ(భోంస్లే) ఎంపికయ్యారు.
◆ ఉత్తమ నటి :: కంగనా రనౌత్‌ను వరించింది. మణికర్ణిక, పంగా సినిమాలకు గాను ఆమెకు ఈ అవార్డు వచ్చింది.
◆ ఉత్తమ సహాయనటుడు ::
విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)
◆ ఉత్తమ సహాయ నటి ::
పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)కు అవార్డులు వచ్చాయి.
★ ఇతర విభాగాలలో :;
◆ ఉత్తమ దర్శకుడు :: బహత్తర్ హూరెయిన్
◆ ఉత్తమ కొరియోగ్రఫీ :: రాజుసుందరం(మహర్షి)
◆ ఉత్తమ సంగీత దర్శకత్వం(పాటలు) :: డి.ఇమాన్(విశ్వాసం)
◆ ఉత్తమ నేపథ్య సంగీతం :: జ్యేష్టపుత్రో
◆ ఉత్తమ గాయకుడు :: బి.ప్రాక్ (తెరె మిట్టీమే పాట, కేసరి సినిమా నుంచి)
● మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ :: సిక్కిం
◆ బెస్ట్ బుక్ ఆన్ సినిమా :: ఏ గాంధియన్ అఫైర్: ఇండియాస్ క్యూరియస్ పోర్ట్రేయల్ ఆఫ్ లవ్ ఇన్ సినిమా(సంజయ్ సూరి)
◆ ఉత్తమ నిర్మాణ సంస్థ :: మహర్షి చిత్రాన్ని నిర్మించిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అవార్డు పొందింది.
◆ బెస్ట్ ఫిలిం క్రిటిక్ :: సోహిని ఛటోపాధ్యాయ
◆ బెస్ట్ యానిమేషన్ ఫిలిం :: రాధ(మ్యూజికల్)
◆ బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం :: జక్కల్
◆ బెస్ట్ ఎడ్యుకేషన్ ఫిలిం :: యాపిల్స్ అండ్ ఆరెంజెస్(ఇంగ్లిష్)
◆ బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్ :: హోలీ రైట్స్(హిందీ), లాడ్లీ(హిందీ)
★ వివిధ భాషల్లో ఉత్తమ చిత్రాలు
- ఉత్తమ హిందీ చిత్రం :: చిచోరె
- ఉత్తమ తమిళ చిత్రం :: అసురన్
- ఉత్తమ కన్నడ చిత్రం :: అక్షి
- ఉత్తమ మలయాళ చిత్రం :: కల్ల నొట్టం
- ఉత్తమ మరాఠీ చిత్రం :: బర్దో
- ఉత్తమ ఒడియా చిత్రం :: ససలా బుధార్ బదలా, కలిర అతితా
- ఉత్తమ బెంగాలీ చిత్రం :: గుమ్నామీ
- ఉత్తమ అస్సామీ చిత్రం :: రొనువా
- ఉత్తమ ఛత్తీస్‌గఢ్ చిత్రం :: భులాన్ ది మేజ్
- ఉత్తమ పంజాబీ చిత్రం :: రబ్ ద రేడియ్ 2