డిగ్రీ కళాశాలల్లో 664 పోస్టులలో అతిథి అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్.

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న సబ్జెక్టుల యందు బోధించడానికి హవర్లీ బేసిస్ పద్ధతిలో అతిథి అధ్యాపకులను నియమించాలని కాలేజీయోట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో దాదాపు 664 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాళీ పోస్టుల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను 664 మంది అతిథి అధ్యాపకులు నియమించుకోవడానికి సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ కు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వులలో అతిధి అధ్యాపకులను నియమించుకోవడానికి విధి విధానాలు మరియు అతిధి అధ్యాపకుల సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.

  • త్రీమెన్ కమిటీ ద్వారా అతిథి అధ్యాపకులు నియమించుకోవాలి.
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ నందు కనీసం 55 శాతం మార్కులను కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉన్న సరిపోతుంది. పీహెచ్డీ, ఎంఫిల్, నెట్, స్లెట్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. అనుభవం ఉన్న అభ్యర్థులకు వెయిటేజ్ ఇవ్వబడును.
  • వీరికి నెలకు 72 గంటలకు గౌరవ వేతనం చెల్లించ బడును.
  • కేవలం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే వీరి సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుంది.
  • క్రమబద్ధీకరణ కొరకు వీరు ఎలాంటి కేసులు వేయడానికి అర్హులు కాదు.
  • వీరికి రెగ్యులర్ అధ్యాపకులు తో సమానంగా ఎలాంటి ప్రయోజనాలు కల్పించబడవు. వీరు కేవలం ఒప్పంద పద్ధతిలో మాత్రమే తీసుకొనబడును.
  • అతిథి అధ్యాపకులు టీచింగ్ డైరీ రాస్తూ, వర్క్ డన్ స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే గౌరవ వేతనం చెల్లించ బడును.
  • అతిథి అధ్యాపకుడు సరిగ్గా విద్యా ప్రమాణాలను పాటిస్తూ బోధన చేయని పక్షంలో తొలగించే అధికారం కలదు.
  • రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులు ఒకవేళ ఆ పోస్ట్ లోకి వస్తే ఎలాంటి నోటీసు లేకుండా అతిథి అధ్యాపకులు తొలగించే అధికారం ఉంటుంది.
  • అతిథి అధ్యాపకులను వచ్చే విద్యా సంవత్సరానికి ఆటో రెన్యువల్ చేసే అవకాశం లేదు.

పూర్తినోటిఫికేషన్ ::

https://drive.google.com/file/d/1KW2dcCd-Ac3sKl3OfC5psdzLY7G073An/view?usp=drivesdk

Follow Us @