బీటెక్ మార్కులతో ECIL లో 650 ఉద్యోగాలు

భార‌త ప్ర‌భుత్వ అణు శ‌క్తి విభాగానికి చెందిన హైద‌రాబాద్ ప్ర‌ధాన‌ కేంద్రంగా ఉన్న ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ECIL) దేశ‌వ్యాప్తంగా వివిధ‌ ప్రాజెక్టుల‌లో ప‌నిచేయ‌డానికి 6 నెల‌ల ఒప్పంద ప్రాతిప‌దిక‌న 650 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.

● అర్హ‌త‌లు :: క‌నీసం 60% మార్కుల‌తో ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రిక‌ల్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, క‌ంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ఏడాది పోస్టు క్వాలిఫికేష‌న్ ఇండ‌స్ట్రియ‌ల్ అనుభ‌వం ఉండాలి.

● వ‌యో పరిమితి :: 31.01.2021 నాటికి 30 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.
SC, ST లకు ఐదేళ్లు, OBC లకు మూడేళ్లు, PWD అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

● ఎంపిక పద్దతి :: అక‌డ‌మిక్ మెరిట్‌(BE/ B TECH మార్కులు‌), అనుభ‌వం ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

● ద‌ర‌ఖాస్తు పద్దతి :: ఆన్లైన్ ద్వారా

● ఆన్లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం :: 06.02.2021.

● చివ‌రి తేది :: 15.02.2021.

● వెబ్సైట్ :: http://www.ecil.co.in/

Follow Us@