న్యూడిల్లీ (ఫిబ్రవరి – 22) : కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి కొత్తరూల్ తీసుకొచ్చింది. విద్యార్థుల వయస్సు 6 ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ రూల్ అమలు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాల్లో 6 ఏళ్లు ఉన్న విద్యార్థులకే ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇస్తోంది. నూతన విద్యా విధానం 2022 ప్రకారం ఈ మార్పులను తీసుకోచ్చారు.