రెండు నెలలపాటు ఉచితంగా రేషన్ బియ్యం – కేసీఆర్

రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి నెలకు రూ.2000, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్ననేపథ్యంలో, మిగిలిన 80 వేల మంది ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి కూడా రూ.2000, 25 కిలోల బియ్యాన్ని అందచేయాలని సీఎం నిర్ణయించారు. సంబంధిత ఆదేశాలను జారీ చేశారు.

Follow Us@