ఇంటర్వ్యూ ఆధారంగా 511 ఉద్యోగాలు భర్తీ చేయనున్న బ్యాంకు ఆప్ బరోడా

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్లైన్‌ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

● మొత్తం పోస్టులు :: 511
(సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్స్‌ 407, ఈ-రిలేషన్‌షిప్‌ మేనేజర్లు 50, టెర్రిటరీ అధిపతులు 44, గ్రూప్‌ హెడ్స్‌ 6, ప్రాడక్ట్‌ హెడ్స్‌ (ఇన్వెస్ట్‌మెంట్‌, రిసెర్చ్‌) 1, ఆరేషన్స్‌ అండ్‌ టెక్నాలజీ హెడ్‌ 1, డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్‌ 1, ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్ మేనేజర్‌ 1)

● అర్హతలు :: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 23 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.

● ఎంపిక విధానం :: ఇంటర్వ్యూ లేదా గ్రూప్‌డిస్కషన్‌. దరఖాస్తుల ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్‌లో

● అప్లికేషన్‌ ఫీజు :: రూ.600, (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100)

● దరఖాస్తులు ప్రారంభం :: ఏప్రిల్‌ 9
● చివరి తేదీ :: ఏప్రిల్‌ 29

● వెబ్సైట్‌: www.bankofbaroda.co.in/Careers.htm

Follow Us@