కరోనా పై పోరాటానికి 50 వేల మంది వైద్యుల నియామకం – కేసీఆర్

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని, అందులో భాగంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్ధంగా వున్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు.

రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం వైద్యాధికారులను ఆదేశించారు.

వీరికి గౌరవప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు. అంతేకాకుండా వారు కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపునివ్వాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సీఎం ఆదేశించారు.

డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

కష్టకాలంలో ప్రజలకు సేవచేయడానికి ముందుకు రావాలని యువ డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. ఆసక్తి వున్న వాళ్లు ఆన్‌లైన్‌లో (https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx) దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Follow Us@