SBI లో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్లైన్‌ దరఖాస్తులు మే నెల 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఇందులో కర్క్‌ పోస్టులతోపాటు క్లరికల్‌ క్యాడర్‌లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు ఉన్నాయి.

● అర్హతలు :: ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు లేదా 1993, ఏప్రిల్‌ 2 నుంచి 2021, ఏప్రిల్‌ 1 మధ్య జన్మించి ఉండాలి. అభ్యర్థులకు స్థానిక భాష తెలిసి ఉండాలి.

● ఎంపిక ప్రక్రియ :: ఆన్లైన్‌ రాతపరీక్ష. ప్రిలిమినరీ, మెయిన్స్‌ అని రెండు విభాగాలుగా ఉంటుంది.

◆ పరీక్ష పద్ధతి ::

● ప్రిలిమినరీ పరీక్ష :: మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 30 మార్కులకు ఉంటుంది. న్యూమరికల్‌ & రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. 70 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

● మెయిన్‌ పరీక్ష :: మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వాటికి 200 మార్కులు కేటాయించారు. జనరల్‌ లేదా ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు, 50 ప్రశ్నలు), జనరల్‌ ఇంగ్లిష్‌ (40 మార్కులు, 40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (50 మార్కులు, 50 ప్రశ్నలు), రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ (50 ప్రశ్నలు, 60 మార్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతారు.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్‌లో

● దరఖాస్తులు ప్రారంభం :: ఏప్రిల్‌ 27

● దరఖాస్తులకు చివరితేదీ :: మే 20

● ప్రిలిమినరీ పరీక్ష :: జూన్‌ లో

● మెయిన్‌ పరీక్ష :: జూలై 31

● వెబ్సైట్‌ :: https://www.sbi.co.in/careers

Follow Us@